HYD: కాసేపట్లో వర్షం.. ఆ ప్రాంతాల వారికి బిగ్ అలర్ట్

by Gantepaka Srikanth |

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం(Weather) మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండలు మండిపోగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

HYD: కాసేపట్లో వర్షం.. ఆ ప్రాంతాల వారికి బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం(Weather) మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండలు మండిపోగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ(Meteorology Department, Hyderabad) ప్రకటన చేసింది. అంతేకాదు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) కూడా జారీ చేసింది. రాగల రెండు గంటల్లో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నగర ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story