- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు.. మే ఫస్ట్ వీక్‌లో వెదర్ ఇలా..
by Naga Rani Yarlagadda |
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. వేడి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనం లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో రెండ్రోజులుగా భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా మాడు పగిలే ఎండ, సాయంత్రానికి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఏదైతేనేం కాసేపైనా ఉక్కపోత నుంచి ఉపశమనం దొరుకుతుందని నగరవాసులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, రామంతాపూర్, నాచారం, మల్లాపూర్ లో జల్లులు పడ్డాయి.
ఈ వర్షం టెంపరరీ రిలీఫ్ ఇచ్చినా.. మున్ముందు వేడి తాపాన్ని మరింత పెంచుతాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మే మొదటివారంలో పవర్ ఫుల్ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఈస్ట్ తెలంగాణలో ఆసిఫాబాద్ నుంచి సూర్యాపేట వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అలాగే ఏపీలో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Next Story






