- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డంకిగా మారిన వర్షం.. సిగాచిలో సహాయక చర్యలకు అంతరాయం
సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద స్థలంలో సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారింది. మూడో అంతస్తు శిథిలాలను తొలగింపుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

దిశ, వెబ్‌డెస్క్: పాశమైలారంలోని (pashamylaram) సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ (Sigachi Incident)లో రియాక్టర్ పేలిన (Reactor Blast) ప్రమాదంలో ఇప్పటి వరకూ36 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరో 40 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బుధవారం ఉదయాన్నే సహాయక చర్యలకు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది. భారీ వర్షం నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాల కిందే గల్లంతైన వారు ఉండి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మూడంతస్తుల భవనం శిథిలాలను తొలగించడం సవాలుగా మారింది.
శిథిలాల నుంచి పొగలు వెలువడుతుండటంతో గల్లంతైన వారు బ్రతికి ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతుండగా.. ఆచూకీ తెలియక బంధువులు బోరున విలపిస్తున్నారు. తన కొడుకు ఆచూకీ చెప్పాలని ఓ తల్లి కనిపించిన వారందరినీ అడుగుతుండటం, కడుపులో 7 నెలల భర్త ప్రతిరూపాన్ని పెట్టుకుని రోధిస్తున్న గర్భిణీ.. ఇలాంటి దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. మరోవైపు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించి బంధువులకే అప్పగిస్తున్నారు డాక్టర్లు.
మృతుల్లో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా.. డెడ్ బాడీల కోసం కుటుంబ సభ్యులు విలపిస్తోన్న తీరు అందరిచే కంటతడి పెట్టిస్తోంది.






