- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు మరోసారి వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో శనివారం అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం కనిపించింది. అంతకుముందు తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసినా శనివారం మాత్రం గ్యాప్ వచ్చింది. అయితే నేడు మళ్లీ రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో శనివారం అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం కనిపించింది. అంతకుముందు తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసినా శనివారం మాత్రం గ్యాప్ వచ్చింది. అయితే నేడు మళ్లీ రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, అసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం కరిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో మధ్యస్థంగా వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగితా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.






