- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు వర్ష సూచన
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం రాష్ర్టవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 4 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గూడూరు వర్గల్‌లో 2 సెం.మీ, కొత్తగూడెం 1 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 34.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Next Story






