- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain Alart: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరిక
తెలంగాణలో మళ్లీ వర్షాలు షురూ అయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు (Telangana Weather) కురుస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ సహ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (MID) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఇవాళ కుండపోత వర్షం కురిసింది. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు కుమురం బీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబబూబాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.






