తెలంగాణకు మళ్లీ వర్ష సూచన

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో మంగళవారం, బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణకు మళ్లీ వర్ష సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంగళవారం, బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో పగటి వేళ నగరవాసులకు అకాల వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం నుండి మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఆదిలాబాద్ , నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి జిల్లా పిట్లం, కుమరం భీం జిల్లా అసిఫాబాద్ జిల్లా జైనూర్, ఆదిలాబాద్, సిర్పూర్, తలమడుగులో చెదురుముదురు జల్లులు కురిశాయి.

Next Story