- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rains effect: వర్షాలకు పవర్ కట్.. జనరేటర్ తో సెల్ ఫోన్ చార్జింగ్ కోసం భారీ క్యూ
జనరేటర్ తో సెల్ ఫోన్ చార్జింగ్ కోసం జనాలు ఎగబడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని భారీ వర్షాలకు (Heavy rains) పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల విద్యుత్ అంతరాయంతో జనాలు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సెల్ ఫోన్లకు చార్జింగ్ లేక ప్రజలు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ లేకుండా పూట గడవడం లేదు. ఇతరులతో సంభాషణలకే కాకుండా లావాదేవీలన్నీ సెల్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. దీంతో విద్యుత్ అంతరాయంతో సెల్ ఫోన్లలో చార్జిగ్ లేకపోవడంతో జనాలు సతమతం అవుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో మొబైల్ చార్జింగ్ కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా గత రెండు రోజులుగా గ్రామంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో తాగునీటికి, తమ సెల్ ఫోన్లలో చార్జింగ్ కోసం గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఈ ఇబ్బందుల నుంచి బయపడేందుకు గ్రామంలోని యువకులు చందాలు వేసుకని డీజిల్ జనరేటర్ తీసుకువచ్చారు. దాని సాయంతో బోర్లు, మొబైల్ చార్జింగ్ కు సాకెట్ బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజులుగా సెల్ ఫోన్లలో చార్జింగ్ లేక ఇబ్బందులు పడ్డ గ్రామస్తులు తమ సెల్ ఫోన్లలో చార్జింగ్ కోసం ఎగబడ్డారు. జనరేటర్ తో సెల్ ఫోన్ చార్జింగ్ (cell phone charging with generator) చేసుకునేందుకు జనాలు ఎగబడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో విద్యుత్ వైర్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ధాన్యం తడిసిపోవడంతో పలు చోట్ల రైతులు కంట తడిపెట్టుకుంటున్నారు.






