తెలంగాణకు వర్షసూచన.. మరో 2గంటల్లో పిడుగులతో కూడిన వర్షం

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో వాతావ‌ర‌ణం మారిపోయింది. మొన్న‌టి వ‌ర‌కు ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు ఎండ‌లు దంచికొడితే ఇప్పుడు మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌ర్షం ప‌ల‌క‌రిస్తోంది.

తెలంగాణకు వర్షసూచన.. మరో 2గంటల్లో పిడుగులతో కూడిన వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో వాతావ‌ర‌ణం మారిపోయింది. మొన్న‌టి వ‌ర‌కు ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు ఎండ‌లు దంచికొడితే ఇప్పుడు మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌ర్షం ప‌ల‌క‌రిస్తోంది. మంగ‌ళ‌వారం రాత్రిప‌లు చోట్ల భారీ ఈదురుగాలులు, పిడుగుల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. బుధ‌వారం సైతం రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షం కురిసింది. ఇక నేడు కూడా రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మ‌ల్, నిజామాబాద్, కామారెడ్డి, అసిఫాబాద్, జ‌గిత్యాల‌, సిరిసిల్ల‌లో మ‌రో రెండు గంట‌ల్లో పిడుగుల‌తో కూడిన‌ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అంతే కాకుండా సంగారెడ్డి, వికారాబాద్, మ‌హ‌బూబాబాద్, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఇక ఆక‌స్మికంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో రాష్ట్రంలో పండించిన వ‌రి ధాన్యం త‌డిచిపోతోంది. దీనివ‌ల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.

Next Story