హైదరాబాద్‌‌లో భారీ వర్షం..ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

by Ajay Maddhiboyina |

తెలంగాణలో వాతావరణం ఎప్పుడు మారుతుందో చెప్పలేదని పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు ఎండలు దంచికొట్టగా సడెన్‌గా వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌‌లో భారీ వర్షం..ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వాతావరణం ఎప్పుడు మారుతుందో చెప్పలేదని పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు ఎండలు దంచికొట్టగా సడెన్‌గా వర్షం కురుస్తోంది. ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలజీ పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్లలో తీవ్రమైన తుఫానులు వీచే అవకాశం ఉందని సాయంత్రం అయ్యే కొద్దీ తుఫానులు తీవ్రతరం కానున్నాయని తెలిపారు. అదే విధంగా హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో మరికొద్దిసేపట్లో వర్షం కురుస్తుందని చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయని తెలిపారు. తూర్పు, ఉత్తర ప్రాంతాలు మల్కాజ్ గిరి, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ లాంటి ప్రాంతాల్లో తీవ్ర తుఫాన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. కోర్ సిటీలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కాబట్టి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు నగరంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం షురూ అయ్యింది.

Next Story