- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిత్వా ఎఫెక్ట్.. రాష్ట్రంలోని 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు మరింత చేరువవుతున్న నేపథ్యంలో, దీని ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలపై గణనీయంగా ఉండవచ్చని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అలాగే రాష్ర్టంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉదయం వేళల్లో పొగమంచు ఉండి, మధ్యాహ్నం సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అత్యల్పంగా 8.2 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది.
కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు:
ప్రాంతం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత( డిగ్రీ సెల్సియస్ లలో)
ఆదిలాబాద్ 8.2
భద్రాచలం 19
హకీంపేట్ 15.5
దుండిగల్ 17.1
హన్మకొండ 15.5
హైదరాబాద్ 17.4
ఖమ్మం 17.6
మహబూబ్ నగర్ 19
మెదక్ 12.8
నల్గొండ 16
నిజామాబాద్ 14.7
రామగుండం 14.8
పటాన్చెరు 14
రాజేంద్రనగర్ 14.5
హయత్ నగర్ 15






