- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్... 17 జిల్లాలకు ఇవాళ వర్షసూచన !
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) అలాగే తెలంగాణ ( Telangana) రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భా

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) అలాగే తెలంగాణ ( Telangana) రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Rains) పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ 17 జిల్లాలకు వర్షాలు ఉన్నట్లు... వాతావరణ శాఖ సూచనలు చేసింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు... వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు లాంటి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. శ్రీ సత్య సాయి, కడప, తిరుపతి, మన్యం, జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు పడే ఛాన్సులు ఉన్నట్లు వెల్లడించింది. అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు మాత్రమే వర్షాలు ఎక్కువగా పడతాయని పేర్కొంది.
ఇందులో ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ ఒక్కరోజే కాదు... నేటి నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని.. పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ వర్షాల నేపథ్యంలో బయటకు వెళ్లేటప్పుడు.... జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పేర్కొంది. హైదరాబాద్ మహానగరంలో కూడా... ఐదు రోజులపాటు వర్షాలు ఉన్నట్టు అంచనా వేసింది.






