TG: సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

by Gantepaka Srikanth |

రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వేచి ఉండు ప్రాంతం (పాసింజర్ హోల్డింగ్ ఏరియా) అభివృద్ధికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TG: సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
X

Railwaysరైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వేచి ఉండు ప్రాంతం (పాసింజర్ హోల్డింగ్ ఏరియా) అభివృద్ధికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 76 స్టేషన్ల జాబితాను ఆమోదించగా అందులో దక్షిణ మధ్య రైల్వేలో ఆరు స్టేషన్లలో ఈ హోల్డింగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణలో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లకు అవకాశం లభించగా... ఏపీలో విజయవాడ, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి స్టేషన్లలో పాసింజర్ హోల్డింగ్ ఏరియాలను అభివృద్ధి చేస్తారు. న్యూఢిల్లీ స్టేషన్‌లో పాసింజర్ హోల్డింగ్ ఏరియా ప్రయోగం విజయవంతం కావడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ స్టేషన్‌లోని పాసింజర్ హోల్డింగ్ ఏరియా దీపావళి, ఛఠ్ పండుగల సందర్భంగా అత్యంత రద్దీని సునాయాసంగా నిర్వహించడానికి సహాయపడింది. న్యూఢిల్లీలోని హోల్డింగ్ ప్రాంతం ఏర్పాటుకు కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే పట్టింది. ఈ హోల్డింగ్ ప్రాంతాలు మాడ్యులర్ డిజైన్‌లో ఉండటంతో పాటు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్మిస్తారు. ఈ నేపథ్యంలో 2026 పండుగల సీజన్ కంటే ముందే అన్ని హోల్డింగ్ ప్రాంతాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులను ఆదేశించారు.

Next Story