Railway Budget: తెలంగాణకు రూ.5337 కోట్లు.. రాష్ట్రంపై రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలివే

by Ramesh Naini |

రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Railway Budget: తెలంగాణకు రూ.5337 కోట్లు.. రాష్ట్రంపై రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలివే
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని (Railway Minister Ashwini Vaishnav) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. (Union Budget 2025) రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5337 కోట్లు నిధులు ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీలోని రైల్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ది చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవతుంతోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు అయినట్లు వెల్లడించారు. త్వరలో తెలంగాణకు నమో భారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు రాబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని తెలిపారు.

సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌

రైల్వే ట్రాక్‌ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర ప్రస్తుతం కవచ్ టెక్నాలజీ ఉందన్నారు. మరో 1,026 కిలోమీటర్ల మేర ఈ టెక్నాలజీ విస్తరింప చేస్తారని చెప్పారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 2056లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు.

Next Story