ఐఎస్ఐ మార్క్‌ను అక్రమంగా ముద్రిస్తున్న కేంద్రంపై అధికారుల దాడులు

by Muthe.Rajitha |

అనుమ‌తి లేకుండా ఐఎస్ఐ మార్కును ముద్రిస్తూ ప‌లు హోట‌ళ్లు, వాణిజ్య కేంద్రాల పేర్లతో వాట‌ర్ బాటిళ్లు త‌యారు చేస్తున్న ఓ కేంద్రంపై బీఐఎస్ హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు చేశారు.

ఐఎస్ఐ మార్క్‌ను అక్రమంగా ముద్రిస్తున్న కేంద్రంపై అధికారుల దాడులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అనుమ‌తి లేకుండా ఐఎస్ఐ మార్కును ముద్రిస్తూ ప‌లు హోట‌ళ్లు, వాణిజ్య కేంద్రాల పేర్లతో వాట‌ర్ బాటిళ్లు త‌యారు చేస్తున్న ఓ కేంద్రంపై బీఐఎస్ హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు చేశారు. గురువారం మూసాపేట్‌లోని ఈ కేంద్రంపై దాడులు నిర్వహించిన అధికారులు లైసెన్సు గ‌డువు ముగిసినా కూడా వేల సంఖ్యలో బాటిళ్లపై ఐఎస్ఐ ముద్ర వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇది బీఐఎస్​ చట్టం 2016 లోని సెక్షన్ 16 , సెక్షన్ 17(3)ను ఉల్లంఘించినట్లేనని , దాదాపు 500 ఎంఎల్​ వాటర్ బాటిల్స్ 13 వేల‌ వరకు , ఒక లీట‌రు బాటిళ్లు 8 వేల వరకు , 250 ఎంఎల్ బాటిళ్లు 15వేల వరకు బీఐఎస్ అధికారులు జ‌ప్తు చేశారు. ఈ సంద‌ర్భంగా బీఐఎస్ జాయింట్ డైరెక్టర్​ స‌విత మాట్లాడుతూ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాట‌ర్‌తో పాటు ఏ ఉత్పత్తి అయినా బీఐఎస్ ధృవీక‌ర‌ణ లేకుండా ఐఎస్ఐ ముద్ర వినియోగించ‌రాదని, ఇది చట్ట రీత్యా నేర‌మ‌న్నారు.

త‌యారీదారులు బీఐఎస్ దృవీక‌రణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత పలు ప‌రీక్షలు, నియ‌మాలు పూర్తయిన త‌ర్వాతే వారికి లైసెన్సు మంజూరు చేస్తామ‌ని ధృవీక‌ర‌ణ లేకుండా ఐఎస్ఐ ముద్ర వాడితేచట్ట ప‌ర‌మైన చ‌ర్యలు తప్పవని హెచ్చరించారు. ఐఎస్ఐ ముద్ర క‌నిపించ‌గానే వ‌స్తువులు కొనేయ వద్దని, వాటిపై ఉండే సీఎంఎల్ నెంబ‌రును బీఐఎస్ కేర్ యాప్‌లో ధృవీక‌రించుకున్న త‌ర్వాతే కొనుగోలు చేయాల‌ని సూచించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నట్లు లేదా న‌కిలీ ఐఎస్ఐ ముద్ర వాడిన‌ట్లు , తప్పనిసరి ధృవీక‌ర‌ణ‌లో ఉన్న ఉత్పత్తులు ఐఎస్ఐ ముద్ర లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే బీఐఎస్ కేర్ యాప్‌లో వెంట‌నే ఫిర్యాదు చేయాల‌ని ఆమె సూచించారు. వారిపై బీఐఎస్ వివిధ చ‌ట్టాల కింద క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటుంద‌న్నారు.

Next Story