డ్రగ్స్‌పై దండయాత్ర.. తెలంగాణ పోలీసులతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జట్టు!

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ పోలీస్ ఈగల్ టీంతో కలిసి పని చేయబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

డ్రగ్స్‌పై దండయాత్ర.. తెలంగాణ పోలీసులతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జట్టు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ పోలీస్ ఈగల్ టీంతో కలిసి పని చేయబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనం‌ద్‌ను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం రెండు రోజులు క్రితం కలిసి తమ సంస్థ నుంచి అవగాహన కల్పిస్తామని కోరగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యను కలవాలని తెలిపారు. ఈ మేరకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం కమాండ్ మానిటరింగ్ సెంటర్ లో సందీప్ శాండిల్యను కలిశారు.

డ్రగ్స్, నిర్మూలన కోసం పనిచేద్దామని ముందుకు రావడం అభినందనీయమన్నారు. మీ సంస్థ నుంచి మీరు చేసే డ్రగ్స్,గంజాయి అవగాహన కార్యక్రమాలకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ముందుగా సంస్థ సభ్యులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కొన్నె దేవేందర్, కొమటి రమేష్ బాబు, గీతా రెడ్డి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story