CM రేవంత్‌ను కలిసిన రాహుల్ సిప్లిగంజ్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) కలిశారు.

CM రేవంత్‌ను కలిసిన రాహుల్ సిప్లిగంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) కలిశారు. ఈనెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్.. ముఖ్యమంత్రిని కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. కాగా, ఇటీవలే.. తెలుగుదేశం పార్టీ నేత, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తె హరిణ్యా రెడ్డితో రాహుల్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సినీ ప్రముఖులతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాహుల్‌కు రూ.కోటి అందించిన సంగతి తెలిసిందే. ఓల్డ్‌ సిటీ నుంచి ‘ఆస్కార్‌’ వరకూ వెళ్లిన కుర్రాడంటూ రాహుల్‌ను ‘గద్దర్‌’ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో సీఎం రేవంత్ కొనియాడారు.

Next Story