- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తెలంగాణ ఆకస్మిక పర్యటన(Telangana Visit) రద్దయ్యింది.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తెలంగాణ ఆకస్మిక పర్యటన(Telangana Visit) రద్దయ్యింది. పార్లమెంటులో కీలక బిల్లుల(Bills In Parliament)పై చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి(Participating)ఉన్నందునా తెలంగాణలో ఈరోజు నిర్వహించాల్సిన తన పర్యటన రద్దు చేసుకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
అంతకు ముందుగా వెల్లడైన సమాచారం మేరకు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా హన్మకొండలో పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశం కావాల్సిఉంది. రాత్రి 7:30 గంటలకు చెన్నైకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో కాజీపేట నుంచి బయల్దేరి వెళ్లాల్సిఉంది. అయితే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వివరాలను మంగళ వారం ఉదయం వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు.
చివరకు పార్టీ ముఖ్య నాయకులకు కూడా ఆయన పర్యటన షెడ్యూల్ వివరాలను వెల్లడించకపోవడం ఆసక్తిరేపింది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఆకస్మికంగా ఖరారైనట్లుగానే అదే స్థాయిలో రద్ధయిపోవడం కాంగ్రెస్ వర్గాలను సైతం అయోమయానికి గురి చేసింది.






