Rahul Gandhi : నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-11 06:12:47  IST  )

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేడు తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ గాంధీ వరంగల్‌ జిల్లా హనుమకొండ(Hanumakonda)కు చేరుకోనున్నారు.

Rahul Gandhi : నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన
X

దిశ‌, వెబ్‌డెస్క్/వ‌రంగ‌ల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. పార్టీ నేత‌లందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి సాయంత్రం 5గంట‌ల‌కు హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్‌గాంధీ అక్క‌డి నుంచి నేరుగా ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో హ‌న్మ‌కొండ‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల మైదానంకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి హ‌న్మ‌కొండ‌లోని సుప్ర‌భ హోట‌ల్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంత‌రం పార్టీ ముఖ్య‌ నేత‌లు, ప్ర‌భుత్వంలోని మంత్రుల‌తో స‌మావేశం కానున్నారు. అనంత‌రం మంగ‌ళ‌వారం రాత్రి 7:30 గంటలకు చెన్నైకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో కాజీపేట నుంచి బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు. రాహుల్ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతోంది. అధికారికంగా షెడ్యూల్ వివ‌రాల‌ను మాత్రం పార్టీ నేత‌ల‌కు సైతం వెల్ల‌డించ‌క‌పోవ‌డం ఆస‌క్తిరేపుతోంది.

నేత‌ల అలెర్ట్‌..!

రాహుల్‌గాంధీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఏఐసీసీ, రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు, ప్ర‌భుత్వ పెద్ద‌లు అల‌ర్ట్ అయ్యారు. రాహుల్ గాంధీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకునేందుకు వరంగ‌ల్‌కు ప‌య‌న‌మ‌య్యారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి చెన్నైలో ఉండ‌గా..ఆయ‌న హుటాహుటిన వ‌రంగ‌ల్‌కు బ‌య‌ల్దేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సురేఖ‌, సీత‌క్క‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు వ‌రంగ‌ల్‌కు చేరుకోనున్నారు. రాహుల్ రాకతో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పట్టణంలో రూట్ మ్యాప్‌ను, ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను విధించ‌నున్నారు.

Next Story