- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకో.. రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీ చేసిన ‘పిరికిపంద’ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేత రామచందర్ రావు ఘాటుగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల కోటద్వార్ ‘వీరు పిరికిపందలు.. ఏమీ చేయలేరు’ అని మాట్లాడిన మాటలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) తీవ్రంగా మండిపడ్డారు. ‘పిరికిపంద’ అనే పదం నిజానికి కాంగ్రెస్ పార్టీకే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని, దేశంలో మతతత్వాన్ని, ద్వేషాన్ని ప్రోత్సహించిందని ఆయన ఆరోపించారు. ఇతరులను విమర్శించే ముందు, గత కొన్నేళ్లుగా తమ పార్టీ పనితీరు ఎలా ఉందో కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారం ఉన్నప్పుడు దేశ భద్రతను కాపాడలేకపోయిన కాంగ్రెస్, ఇప్పుడు ఇతరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రామచందర్ రావు కామెంట్ చేశారు.






