Rahul Gandhi: రాహుల్ గాంధీ అశోక్ నగర్ రావాలి: టీజీపీఎస్సీ అభ్యర్థులు

by Prasad Jukanti |

రాహుల్ గాంధీ అశోక్ నగర్ రావాలని టీజీపీఎస్సీ అభ్యర్థులు కోరారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ అశోక్ నగర్ రావాలి: టీజీపీఎస్సీ అభ్యర్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరు కాబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్ (Ashok Nagar) రావాలని టీజీపీఎస్సీ (TGPSC Candidates) అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ లో కులగణనపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు రాహుల్ గాంధీ హాజరుకాబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh kumar Goud ) నిన్న ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోపై టీజీపీఎస్సీ యాస్పిరెంట్ కమ్యూనిటీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్ చేరుకుని అభ్యర్థులతో మాట్లాడారని, ఇప్పుడు కూడా అశోక్ నగర్ కు వచ్చి తమ సమస్యలను వినాలని కోరారు.

Next Story