BRS ఎమ్మెల్యేలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-25 09:17:56  IST  )

బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియా పెరిగిపోయిందని వీటి ద్వారా వచ్చే డబ్బు అంతా కేసీఆర్ ఇంటికే చేరుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

BRS ఎమ్మెల్యేలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియా పెరిగిపోయిందని వీటి ద్వారా వచ్చే డబ్బు అంతా కేసీఆర్ ఇంటికే చేరుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బోధన్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మాట్లాడిన రాహుల్.. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారని కమిషన్ ఇవ్వనిదే దళితబంధు ఇవ్వడం లేదని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను డైవర్ట్ చేసిందని రాష్ట్రంలో ప్రజల పాలన అనేది కనిపించడం లేదన్నారు. కుటుంబ, అవినీతి పాలన వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందని రాబోయే పదేళ్లు ప్రజల తెలంగాణ ఉండబోతున్నదని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500 కే ఇస్తామన్నారు. తమ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

Next Story