- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టేడియంలో రాహుల్ గాంధీ, మెస్సీ, సీఎం రేవంత్ డిజిటల్ బ్యానర్.. నెట్టింట వైరల్
ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ సందర్భంగా స్టేడియం లోపల ఏర్పాటు చేసిన భారీ డిజిటల్ బ్యానర్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ సందర్భంగా స్టేడియం లోపల ఏర్పాటు చేసిన భారీ డిజిటల్ బ్యానర్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ చిత్రంతో పాటు ప్రముఖ నేతల చిత్రాలు కనిపిస్తున్నాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఒకే ఫ్రేమ్‌లో రాహుల్ గాంధీ, మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి’ అంటూ పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ డిజిటల్ బ్యానర్‌పై నెటిజన్‌లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. క్రీడల వేదికపై రాజకీయాల టచ్.. అంటూ కొందరు ప్రశంసలు కురిపించారు. స్పోర్ట్స్, పాలిటిక్స్ రెండూ కలిస్తే ట్రెండ్ తప్పదు అని కొంత మంది నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒక విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య (Revanth reddy) ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సింగరేణి ఆర్‌ఆర్9, అపర్ణ మెస్సీ జట్ల పేరుతో ఈ మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై సందడి చేశారు. ట్వీట్ ఇదే..






