T BJP: ఇంత జరిగినా రాహుల్ గాంధీ గుణపాఠం నేర్చుకోలేదు: బూర నర్సయ్య గౌడ్

by Prasad Jukanti |

ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి ఓటు చోరీ అంటూ ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని బూరనర్సయ్య గౌడ్ ఆరోపించారు.

T BJP: ఇంత జరిగినా రాహుల్ గాంధీ గుణపాఠం నేర్చుకోలేదు: బూర నర్సయ్య గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వివిధ ఎన్నికల్లో వరుసగా ఘోర ఓటమి పాలవుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణపాఠం నేర్చుకోవడం లేదని తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ప్రజల తీర్పుకు ప్రామాణికం అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సాంప్రదాయక వంశపారంపర్య ధోరణితో మేము గెలిస్తే అంతా బాగుందని ఓడిపోతే మాత్రం ఈవీఎంలు, ఓటు చోరీ నెపం మోపుతోందని ధ్వజమెత్తారు. ఇవాళ ఓ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడిన ఆయన.. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు రాహుల్ గాంధీ చేస్తున్న అసంబద్ధమైన, అర్థరహితమైన వైఖరిని వదిలివేయాలని సూచించారు.

Next Story