పార్లమెంట్ నుంచి పారిపోయింది రాహులే.. ‘గాయబ్’ ట్వీట్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-30 06:44:59  IST  )

ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) టార్గెట్‌గా సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్‌ పార్టీ (Congres Party) పెట్టిన ‘గాయబ్’ పోస్ట్ పోలిటికల్‌గా కాకరేపుతోంది.

పార్లమెంట్ నుంచి పారిపోయింది రాహులే.. ‘గాయబ్’ ట్వీట్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) టార్గెట్‌గా సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్‌ పార్టీ (Congres Party) పెట్టిన ‘గాయబ్’ పోస్ట్ పోలిటికల్‌గా కాకరేపుతోంది. పహల్గాం టెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack) నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పీఎం మోదీ (PM Modi) డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే, అదే విషయాన్ని తప్పుబడుతూ ప్రధానిపై హస్తం పార్టీ చేసిన ‘గాయబ్’ పోస్ట్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీపై ఓ రేంజ్‌లో మాటాల తూటాలు పేల్చారు.

దీంతో వెనక్కి తగ్గిన ఆ పార్టీ వివాదాస్పద పోస్టును ‘X’ నుంచి తొలగించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్‌పై ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము పార్లమెంట్‌ (Parliament)లో విపక్షాలకు ఇచ్చే సమాధానాలతో దిమ్మతిరిగి పార్లమెంట్ నుంచి గాయబ్ అయ్యేది రాహుల్ గాంధీ (Rahul Gandhi)నే సెటైర్లు వేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలకు ఇంకా బాధపెట్టేలా ఉన్నాయని కామెంట్ చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగేలా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లకు దేశంలో ఉండే హక్కు, అర్హత లేదని రఘునందన్ రావు కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

Next Story