- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీలింగ్ ఎత్తివేత లీగల్‌గా నిలబడే అవకాశం లేదు: రఘునందన్‌రావు
రిజర్వేషన్ల విషయంలో ఉన్న సీలింగ్ పై కేబినెట్ నిర్ణయాన్ని రఘునందన్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ కు బీసీరిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు. రిజర్వేషన్ల (Reservations) సీలింగ్ ఎత్తివేతపై అవగాహన లేకుండా ముందుకెళ్తోందని దుయ్యబట్టారు. పంచాయతీల్లో రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన రఘునందన్ రావు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ తో సుప్రీం, హైకోర్టు తీర్పులు పరిగణనలోకి తీసుకోకుండా రిజర్వేషన్ల సీలింగ్ విషయంలో ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ నిర్ణయం లీగల్‌గా నిలబడే అవకాశం లేదన్నారు.
బీసీలుకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులను రాష్ట్రపతి పెండింగ్ లో పెడ్డటం ఆర్డినెన్స్ సైతం పెండింగ్ లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోతో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించిన కేబినెట్ భేటీలో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A) కు సవరణ చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఈ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.






