- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దానికి ఎంతో టైమ్ లేదు.. MP రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీజేపీ(BJP) కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు బొమ్మ, బొరులు లాంటివని అన్నారు. రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారైందని తెలిపారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటాయి.. చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక(Telangana MLC elections)ల్లో బీజేపీ అభ్యర్థులు గెలువాల్సిన అవసరం ఉంది.
బీఆర్ఎస్(BRS) అభ్యర్థి ఎవరో ఆ పార్టీ ఇంతవరకూ ప్రకటించలేదు. అన్ని తామేనని చెప్పుకునే ఆరడుగుల పొడుగున్న హరీశ్ రావు.. పక్కనే పదేండ్లు పాలించిన వ్యక్తి ఉన్నా మీ అభ్యర్థి ఎవరంటే చెప్పడం లేదని రఘునందన్ రావు విమర్శించారు. బీఆర్ఎస్‌ది ఇక ముగిసిన అధ్యాయం అని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ(BJP Telangana), కాంగ్రెస్ మాత్రమే మిగిలాయి. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్‌కు కేవలం మూడడుగుల దూరంలో ఉన్నాం. అతి త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.






