- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నదని.. విద్యార్థుల ఇన్నోవేటివ్‌కి ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా సంక్షేమ శాఖలపై జరిగిన చర్చలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అజారుద్దీన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖపై పొన్నం మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల విజన్ 2047లో మంచి విద్య, స్కిల్ డెవలప్మెంట్‌పై ప్రత్యేక ప్రణాళికల ద్వారా ముందుకుపోతున్నామని చెప్పారు. విజన్ 2047లో 80 శాతానికి పైగా ఉన్న జనాభా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం లేకుండా అభివృద్ధి అనేది అసాధ్యమని భావిస్తున్నదని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, రిజర్వేషన్స్ అమలు, ఉన్నత విద్య, విదేశీ విద్య లకు భవిష్యత్తులో అన్నిరకాల ప్రాధాన్యత ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న మేధావుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం విద్యలో సమూల సంస్కరణలు చేస్తున్నదని.. డైట్ చార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నదని చెప్పారు. పేదలకు ప్రభుత్వం ఇవ్వగలిగేది నాణ్యమైన విద్య మాత్రమే అని.. అది అందించినప్పుడే ఆ సమాజం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వేలో కేవలం ఉన్నత చదువులు చదివిన కుటుంబం మాత్రమే ఉన్నత స్థాయిలో ఉన్నదన్నారు. అందుకే ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నదని.. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ కర్తవ్యమని వెల్లడించారు.






