Road Safety Raksha Bandhan: రాఖీతో రోడ్డు భద్రతా సందేశం.. రాచకొండ పోలీసుల వినూత్న రక్షాబంధన్

by Ramesh Naini |

Road Safety Raksha Bandhan: రాఖీతో రోడ్డు భద్రతా సందేశం.. రాచకొండ పోలీసుల వినూత్న రక్షాబంధన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ (Raksha Bandhan) వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాచకొండ పోలీసులు వినూత్న తీరులో రక్షాబంధన్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని (Traffic Rules) చెబుతూ వినూత్న తీరులో వాహనదారులకు అవగాహన కల్పించారు. రాఖీ పండుగ సందర్భంగా (Rachakonda Traffic Police) రాచకొండ ట్రాఫిక్ పోలీసులు, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ప్రజలకు రాఖీలు కట్టి, సోదరి ప్రేమతో “మీ ప్రాణం మాకు ముఖ్యం” అనే సందేశం అందించారు. ఈ మేరకు రాచకొండ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్స్, తదితర ప్రాంతాల్లో మహిళా ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని బైకర్లకు రాఖీలు కట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హితబోధ చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన, హెల్మెట్ ధరించే ప్రాముఖ్యత, ప్రమాదాల నివారణపై వారికి అవగాహన కల్పించారు. ప్రతి ప్రయాణంలో హెల్మెట్ మీ రక్షణ కవచం అని రాచకొండ పోలీస్ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. రాఖీ బంధం మీకు సోదరి ప్రేమను గుర్తు చేస్తే, (Wear helmet) హెల్మెట్ మీకు ప్రాణ రక్షణను అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు శనివారం (@RachakondaCop) రాచకొండ పోలీస్ అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా పలు ఫోటోలు పంచుకున్నారు. రాఖీతో రోడ్డు భద్రతా సందేశం అంటూ ట్వీట్ చేశారు.

Next Story