- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌లో వల వేస్తున్న కిలాడీ లేడీలు! పెళ్లి, సహజీవనం పేరుతో ట్రాప్.. రాచకొండ పోలీస్ హెచ్చరిక
వాట్సాప్, సోషల్ మీడియా వేదికలపై కొత్త రకం మోసాలకు యువకులు బలవుతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు మరోసారి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వాట్సాప్(WhatsApp), సోషల్ మీడియా వేదికలపై కొత్త రకం మోసాలకు యువకులు బలవుతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు మరోసారి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ‘పెళ్లి’, ‘సహజీవనం’ పేరుతో ట్రాప్ చేసి డబ్బు దోచుకోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం రాచకొండ పోలీస్ @RachakondaCop (Rachakonda Police) అధికారులు ఒక ఆసక్తికర ట్వీట్ చేస్తూ, అవగాహన కల్పించే వీడియోను షేర్ చేశారు.
‘వాట్సాప్‌లో వల వేస్తున్న కిలాడీ లేడీలు.. పెళ్లి, సహజీవనం పేరుతో విసిరే వలకు జాగ్రత్త, సోషల్ మీడియాలో పరిచయాలు పెంచి నమ్మకం పొందిన తర్వాత డబ్బు, బ్లాక్‌మెయిల్ వంటి మోసాలు జరుగుతున్నాయి. సందేహాస్పద నంబర్ల నుండి వచ్చే కాల్స్, చాట్స్‌కి స్పందించకండి. మోసం జరిగితే వెంటనే (Cybercrime) సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నంబర్ 1930 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ ట్వీట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, ఎలాంటి అనుమానాస్పద లింకులు, వీడియో కాల్స్‌కి స్పందించకూడదని పోలీసులు సూచించారు. రాచకొండ పోలీసుల ఈ అవగాహన ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎలాంటి మోసం జరిగిన వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. ట్వీట్ ఇదే..






