- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rachakonda Police: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా..? ఈ మార్గాలు ఎంచుకుంటే బెటర్
సంక్రాంతి పండుగ(Sankranthi Festival) సందర్భంగా ప్రజలు పట్టణాలను వీడి పల్లె బాట పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranthi Festival) సందర్భంగా ప్రజలు పట్టణాలను వీడి పల్లె బాట పడుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంటున్నది. చౌటుప్పల్(Choutuppal) మీదుగా ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) వెళ్లే వైపు వాహానాల రద్దీ ఎక్కువగా ఉండటంతో పంతంగి టోల్ ప్లాజా(Panthangi Toll Plaza) వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈ రద్దీ దృష్యా తగ్గించడానికి రాచకొండ పోలీసులు(Rachakonda Police) ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వేరే మార్గాలను సూచిస్తూ.. ట్విట్టర్ లో ట్రాఫిక్ అడ్వైసరీ(Traffic Advicery) పోస్ట్ పెట్టారు.
ఇందులో సంక్రాంతికి ఆంధ్ర వైపుకు వెళ్లే వాహనదారులకు రాచకొండ పోలీస్ వారి విజ్ఞప్తి అని, పెద్ద అంబర్పేట్ (EXIT-11) నుండి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు సంక్రాంతి పండగ వల్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం మూలాన వేరే మార్గాలు సూచించడం అయినది అని తెలిపారు. ఇందులో విజయవాడ వైపు వెళ్లే వారు ఘట్కేసర్ (EXIT-9] నుండి భువనగిరి - వలిగొండ- రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చని, అలాగే గుంటూరు వైపు వెళ్లేవాళ్లు బొంగులూరు [EXIT-121] గేటు నుండి ఇబ్రహీంపట్నం - మాల్ - దేవరకొండ మీదుగా గుంటూరు చేరుకోవచ్చని సూచించారు.






