- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితులు ఫుల్ ఖుష్. 1130 ఫోన్ లు రికవరీ..
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 1130 మొబైల్ ఫోన్ లను మంగళవారం పోలీసులు రికవరీ చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలలో మొబైల్ ఫోన్ లు మిస్సింగ్, చోరీలకు సంబంధించి సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటింటి రిజిస్ట్రీ) పోర్టల్ లో బాధితులు నమోదు చేశారు.

దిశ, సిటీక్రైం : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 1130 మొబైల్ ఫోన్ లను మంగళవారం పోలీసులు రికవరీ చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలలో మొబైల్ ఫోన్ లు మిస్సింగ్, చోరీలకు సంబంధించి సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటింటి రిజిస్ట్రీ) పోర్టల్ లో బాధితులు నమోదు చేశారు. పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఈ మొబైల్ ఫోన్ ల రికవరీ కోసం సీసీఎస్ మల్కాజిగిరి, భోనగిరి, ఎల్బీనగర్ సిబ్బంది, అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.
ఐటీ సెల్ సహాకారంతో ఈ టీంలు పని చేసి 2 నెలలో 3.50 కోట్లు విలువ చేసే 1130 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మంగళవారం ఫోన్ ల యజమానులకు అందించి వారిలో సంతోషాన్ని నింపారు. ఎల్బీనగర్ సీసీఎస్ -706, మల్కాజిగిరి సీసీఎస్ -312, భోనగిరి సీసీఎస్-112 ఫోన్ లను రికవరీ చేశారు. ఇలా ఈ ఏడాది మొత్తంలో రాచకొండ పోలీసులు 3694 ఫోన్ లను రికవరీ చేసి యజమానులకు అందించారు. ఈ రికవరీ కోసం పని చేసిన పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.
ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్ తో నే కాబట్టీ జాగ్రత్తా
మొబైల్ ఫోన్ చోరీకి గురైన అది మిస్సింగ్ అయినా ఆ యజమానిని తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంది. ఫోన్ లో ఉండే వ్యక్తి గత సమాచారంతో పాటు ఆర్ధిక పరమైన డాటా కూడా గుర్తు తెలియని వారి చేతులకు చిక్కే అవకాశం ఉంది. కాబట్టీ ఈ మొబైల్ ఫోన్ లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సీపీ సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ ఫోన్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఇతరులు ఆ ఫోన్ తో మిమ్మల్ని బ్లాక్ చేయడంతో పాటు ఇంకా అనేక బెదిరింపులు, వేధింపులకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టీ ఫోన్ ను కాపాడుకోవడం తో పాటు అందులోని సమాచారం బయటికి పోకుండా పటిష్టమైన పాసువార్డులను ఏర్పాటు చేసుకోవాలని సీపీ కోరుతున్నారు.
మొబైల్ ఫోన్ యజమానులకు సూచనలు ఇలా
*మీ ఫోన్ లో ఫైండ్ మై డివైజ్ ఆప్షన్ ను సెట్టింగ్స్ లో అందుబాటులో పెట్టుకోవాలి.
*మీ ఫోన్ ను ఇతరులు అపరేట్ చేయకుండా అది ఓపెన్ కాకుండా పటిష్టమైన పాసువార్డులను పెట్టుకోవాలి.
*రద్దీ ప్రాంతంలో తిరిగే సమయంలో, ట్రావెల్ చేస్తున్న సందర్భంలో ఫోన్ లను జాగ్రత్తగా పెట్టుకోవాలి.
*చోరీ ఫోన్ లతో క్రిమినల్స్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.
*సమాచారం భద్రపర్చుకునేందుకు మీ ఫోన్ లో బ్యాక్ అప్ ఆప్షన్ ను పెట్టుకోవాలి.
*మీ ఫోన్ చోరీ గురైన, మిస్సింగ్ అయినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లేదా పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలి.
*రశీదు లేకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొనుగొలు చేయొద్దు.
*చోరీకి గురైన ఫోన్ లను అమ్మినా, కొనుగొలు చేసినా అది నేరమే.






