- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా ఆర్.తిరుపతి నియామకం
by Gantepaka Srikanth |
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా ఆర్.తిరుపతి నియామకం

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనసభ నూతన కార్యదర్శిగా ఆర్.తిరుపతి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీ.నరసింహాచార్యులు తెలంగాణ శాసన మండలి కార్యదర్శిగా నియమితులయ్యారు. రెండో లెజిస్లేచర్ సెక్రటరీ పోస్టు సృష్టించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, రాష్ట్ర గవర్నర్ ఆదేశానుసారం ఈ నియమాకాలను చేపట్టినట్లుగా సీఎస్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనితో అసెంబ్లీకి, మండలికి వేర్వేరుగా కార్యదర్శులను నియమించినట్లైంది. కాగా, తిరుపతి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహారిస్తున్నారు.
Next Story






