- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలంటే భయపడే స్థాయికి తెస్తాం.. ఒక్క మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసేయాలి.. ఆర్. కృష్ణయ్య పిలుపు
బీసీలంటే అందరికీ చిన్నచూపు, అందుకే బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామని బీజీ జేఏసీ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలంటే అందరికీ చిన్నచూపు, అందుకే బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామని బీజీ జేఏసీ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. బీసీలకు కోర్టులు అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం ఈ నెల 18న తెలంగాణ బంద్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. బంద్‌లో అందరూ శాంతి యుతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో ఒక్క మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసేయాలని వ్యాపారులను రిక్వెస్ట్ చేశారు.
ఆర్టీసీ బస్సులు సైతం తిరగొద్దు.. ప్రజలు ఆవేశంగా ఉన్నారు.. బస్సులు తిరిగితే తగులపెట్టే ప్రమాదం కూడా ఉందని ఆర్. కృష్ణయ్య అన్నారు. ఇలాంటి బంద్ చరిత్రలో ఎప్పుడు జరగలేదని, భవిష్యత్‌లో కూడా జరగని అన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అలాగే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 18న జేఏసీ తలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బంద్‌లో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొంటారని వెల్లడించారు.






