- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ కేన్‌తో అంధుల కళ్లలో వెలుగులు
క్వాడ్రిక్ ఐటీ మరో లక్ష్యంతో ముందుకొచ్చింది. బయో ఏషియా 2026 సదస్సులో దృష్టిలోపం ఉన్నవారికోసం రూపొందించిన స్మార్ట్ ఏఐ కేన్ ను ప్రవేశపెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది బయో ఏషియా వేదికపై రీనోట్ ఏఐతో అరంగేట్రం చేసిన క్వాడ్రిక్ ఐటీ 2026లో మరో లక్ష్యంతో ముందుకొచ్చింది. మంగళవారం హైటెక్స్‌లో నిర్వహించిన బయో ఏషియా 2026 సదస్సులో క్వాడ్రిక్ సంస్థ సంచలనం సృష్టించింది. తన తాజా పోర్ట్‌ఫోలియోలో భాగంగా దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించిన స్మార్ట్ ఏఐ కేన్‌ను ప్రవేశపెట్టింది. ఇది కేవలం సాంకేతికతను ప్రదర్శించడమే కాకుండా, సామాజిక ప్రభావం చూపే దిశగా సంస్థ అడుగులు వేస్తుందనడానికి నిదర్శనం. సామాజిక ప్రయోజనంతోపాటు, వైద్య, ఫార్మా రంగాల్లోని నిపుణుల సమస్యలను పరిష్కరించే దిశగానూ క్వాడ్రిక్ ఐటీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సంస్థ మెడికల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ఆవిష్కరించింది. సాధారణ ఏఐ మాదిరి కాకుండా, ఇది వైద్య పరిభాష, క్లినికల్ డాక్యుమెంట్లు, శాస్త్రీయ సాహిత్యాన్ని అర్థం చేసుకునేలా ప్రత్యేకంగా శిక్షణ పొందింది. మెడికల్ అఫైర్స్, రెగ్యులేటరీ, పరిశోధన బృందాలు పత్రాల సంగ్రహణ, సమాచార అన్వేషణ వంటి పునరావృత పనులను త్వరగా పూర్తి చేసి, మరింత క్లిష్టమైన క్లినికల్ పనులపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదపడుతుంది.
విద్యార్థి ఆలోచన నుంచి పుట్టిందే స్మార్ట్ కేన్
ఓ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆలోచన నుంచి ఈ స్మార్ట్ కేన్ రూపుదిద్దుకున్నది. సెన్సార్లు, కంప్యూటర్ విజన్ సాయంతో అడ్డంకులను గుర్తించి, వినియోగదారునికి ఆడియో, వైబ్రేషన్ ద్వారా హెచ్చరికలు అందిస్తుంది. తక్కువ ధరలో లభించే ఈ పరికరం, అంధులు, దృష్టి లోపం ఉన్నవారికి సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రయాణాన్ని అందించనుంది. అలాగే.. వ్యాపార కార్యకలాపాల్లోని సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు క్వాడ్రిక్ ఐటి క్లోఫాస్ట్‌ను సైతం ప్రవేశపెట్టింది. ఇది పూర్తిస్థాయిలో ఏఐ ఆధారిత ప్లాట్ ఫారం. ఇది ఈఆర్‌పీ వ్యవస్థల్లోని డేటా వ్యత్యాసాలు, సయోధ్య సమస్యలను గుర్తించి, వాటి మూల కారణాలను విశ్లేషించి, ఆదాయ నష్టాన్ని నివారించేందుకు ఫైనాన్స్, ఆపరేషన్స్ బృందాలకు సహాయపడుతుంది. గతేడాది ప్రారంభించిన రీనోట్ ఏఐ ఇప్పుడు స్మార్ట్ సింక్ పెన్‌గా రూపాంతరం చెందింది. ఇది ఫ్యాక్టరీలు, ల్యాబ్, ఫీల్డ్ నుండి చేతితో రాసిన గమనికలను నేరుగా డిజిటల్ వ్యవస్థల్లోకి అప్‌లోడ్ చేస్తున్నది. తద్వారా కాగితం ఆధారిత ప్రక్రియల నుండి డిజిటల్ ప్రక్రియలకు మారేందుకు సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తున్నది. ఇవే కాకుండా లైఫ్ సైన్సెస్ రంగంలో ఈవెంట్ల నిర్వహణను సులభతరం చేసే కాన్ఫరెన్స్ యాప్, ఇన్నోవేషన్ కార్యక్రమాలకు తోడ్పడే హ్యాక్ టూ బిల్డ్, టెండర్, ఆర్డర్ వర్క్‌ఫ్లోల కోసం టెన్డోరిక్స్ వంటి పలు ప్లాట్‌ఫారాలను కూడా క్వాడ్రిక్ ఐటీ బయో ఏషియా వేదికపై ప్రదర్శించింది. కేవలం ఏఐ సాధనాలను నిర్మించడమే కాకుండా, జీవితాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని క్వాడ్రిక్ ఐటీ అధికారులు పేర్కొన్నారు.






