సీపీపీ పనుల పరిశీలించిన క్యూక్యూయూడీఏ ఏఓ గౌతమి

by Malleboina Mahesh |

చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పనులను పరిశీలించిన QQSUDA అధికారులు. నెల రోజుల్లో పోలీసు అవుట్‌పోస్టుల పూర్తికి ఆదేశం. పాతబస్తీలో అభివృద్ధి వేగవంతం.

సీపీపీ పనుల పరిశీలించిన క్యూక్యూయూడీఏ ఏఓ గౌతమి
X

దిశ, తెలంగాణ బ్యూరో: చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు(సీపీపీ)లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(క్యూక్యూ యూ డీఏ) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గౌతమి మంగళవారం పరిశీలించారు. దీంతోపాటు యునాని హాస్పిటల్, లాడ్ బజార్, మిరాలం మండి మార్కెట్, పోలీసు అవుట్ పోస్టులు, జులు ఖానా మార్కెట్, జులు ఖానా కమాన్ పనులను పరిశీలించారు. నెల రోజుల్లో రెండు పోలీసు అవుట్ పోస్ట్ లకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను గౌతమి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి రోహిణి, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(క్యూక్యూయూడీఏ) ఎస్ఈ గోపాల్, జీహెచ్ఎంసీ, ఎన్ఐయూఎం అధికారులు పాల్గొన్నారు.

Next Story