- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్య దేశానికి పరిపాలన దక్షకుడు పివీ: స్పీకర్ గడ్డం ప్రసాద్
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలన దక్షకుడిగా పివీ నరసింహ రావు ఖ్యాతి పొందారని, దేశానికి ప్రధాని అయిన తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలన దక్షకుడిగా పివీ నరసింహ రావు ఖ్యాతి పొందారని, దేశానికి ప్రధాని అయిన తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆయన ఆర్థికవేత్త, సంస్కరణలకర్తగా చరిత్రలో నిలిచారని గడ్డం ప్రసాద్ కుమార్ వివరించారు. దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు వర్ధంతి సందర్భంగా మంగళవారం శాసనసభ భవనం లాబీ హాల్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఇవాళ దేశం ఆర్ధిక సమస్యలను తట్టుకుని నిలబడుతోంది అంటే దానికి కారణం పివీ అని, ఆయన చూపించిన బాటలో మనమందరం పయనించాలని ఆయన సూచించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నరసింహ రావు దేశానికి ఎనలేని సేవ చేశారని, ప్రధానిగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఆర్థికవేత్తగా దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు. పీవీ గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడని, 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారన్నారు. పీవీ నరసింహా రావు నిజాయితికి, నిరాడంబరతకు నిలువుటద్దమని గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, బోగరపు దయానంద్, లెజిస్లేచర్ సెక్రటరీ వి. నరసింహ చార్యులు, పీవీ కుటుంబ సభ్యులు, సీఎల్పీ సెక్రెటరీ శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.






