Kavitha: జూబ్లీహిల్స్ బై పోల్ లో ట్విస్ట్.. కవితతో మాజీ ఎమ్మెల్యే విష్ణు భేటీ.. కవిత తరఫున పోటీ?

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ బై పోల్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణు కవితతో భేటీ అయ్యారు.

Kavitha: జూబ్లీహిల్స్ బై పోల్ లో ట్విస్ట్.. కవితతో మాజీ ఎమ్మెల్యే విష్ణు భేటీ.. కవిత తరఫున పోటీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర రాజకీయం అంతా జూబ్లీహిల్స్ బై పోల్ కేంద్రంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితతో (Kavitha) జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ((P.Vishnu Vardhan Reddy) భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఇవాళ ఉదయం కవిత నివాసానికి వెళ్లిన విష్ణువర్ధన్ అరగంటకుపైగా ఆమెతో చర్చించారు. ఇటీవల బీఆర్ఎస్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత తరఫున అభ్యర్థి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

దాల్ మే కుచ్ కాలా హై!...

ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్‌రెడ్డి పెద్దమ్మతల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితను ఆహ్వాన పత్రిక అందించేందుకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ భవన్, కేసీఆర్‌తోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు. అయితే విష్ణువర్ధన్ పైకి అలా చెప్పినా సమావేశంలో జూబ్లీహిల్స్ బై పోల్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కవితతో బీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. ఆమె పేరు ప్రస్తావించడానికి అగ్రనేతలు ఎవరూ సాహసించడం లేదు. అలాంటిది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న విష్ణు కవితను కలవడం వెనుక ఏదో మతలబు ఉండే ఉంటుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

బీఆర్ఎస్‌పైకి పీజేఆర్ అస్త్రం!..

జూబ్లీహిల్స్ బై పోల్‌లో (Jubilee Hills By-poll) కేంద్రంగా కవిత బీఆర్ఎస్‌కు ట్విస్ట్ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇక్కడ గెలిచేందుకు కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తూ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థి అనే సంకేతాలను సైతం ఇచ్చేశారు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు కవితతో సమావేశం కావడం బీఆర్ఎస్ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ బై పోల్ విషయంలో బీఆర్ఎస్‌పై కవిత పీజేఆర్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే జూబ్లీహిల్స్ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

Next Story