- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, పీవీ నరసింహారావు(PV Narasimha Rao) జయంతి(Birth Anniversary) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయన సేవలను కొనియాడారు. జూన్ 28న పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని, పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా అభివర్ణించారు. 1991లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన ప్రధానమంత్రిగా చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, దేశ ప్రగతిని పరుగులు పెట్టించాయని పేర్కొన్నారు.
దేశంలో ఆర్థిక స్థిరత్వానికి, విదేశీ మారక ద్రవ్య నిల్వల పెంపునకు పీవీ ఆర్థిక ప్రణాళిక దోహదపడిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పీవీ బహుభాషా కోవిదుడు, దార్శనికుడు, మేధావిగా దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించారని, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహనీయుడని కీర్తించారు.






