పుష్ప-2 మరో సంచలనం.. అక్షరాల రూ.110 కోట్ల ట్యాక్స్ చెల్లించిన మూవీ టీం

by Gantepaka Srikanth |

తెలుగు సినిమా చరిత్రలో గ్రాండ్ సక్సెస్ పుష్ప–2. ఫుల్ కలెక్షన్లతో టాక్ ఆఫ్ ది సినిమాగా నిలిచింది. అనేక వివాదాలు కూడా ముసిరాయి.

పుష్ప 3
X

పుష్ప 3

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు సినిమా చరిత్రలో గ్రాండ్ సక్సెస్ పుష్ప–2. ఫుల్ కలెక్షన్లతో టాక్ ఆఫ్ ది సినిమాగా నిలిచింది. అనేక వివాదాలు కూడా ముసిరాయి. అయితే ఈ సినిమా కలెక్షన్ల మీద జోరుగా వార్తలు వినిపించాయి. నిజానికి నవంబరు, డిసెంబరు.. రెండు నెలల్లోనే రూ.642 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఎంత ఖర్చు చేశారో తెలియదు. కానీ తాజాగా చెల్లించిన టాక్స్‌తో కలెక్షన్స్‌పై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపిన వివరాలు ‘దిశ’కు అందాయి. పుష్ప 2 సినిమాకు సంబంధించిన ట్యాక్స్ పేయర్ నెలవారీ జీఎస్టీఆర్–3బి, జీఎస్టీఆర్–01 రిటర్న్స్‌ని కమర్షియల్ ట్యాక్స్ శాఖకు సమర్పించారు. ఇందులో సినిమాకు సంబంధించినవే కాకుండా ఇతర రిటర్న్స్ కూడా ఉండొచ్చునని అధికారులు స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా పుష్ప-2 సినిమాకు సంబంధించిన రెవెన్యూ బ్రేకప్ చెప్పలేం. కానీ వారి నుంచి వచ్చిన పన్నులు మాత్రం నవంబరు, డిసెంబరు నెలలకు గాను రూ.110 కోట్ల వరకు ఉంది. ఈ రెండు నెలల టర్నోవర్ రూ.642 కోట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఇందులో ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీలకు సెపరేట్‌గా చెల్లించిన వివరాలను అందించారు. ఇందులోనే సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకం, ఓటీటీ రైట్స్, ఓవర్ సీస్ ఆడియో రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఉండొచ్చునన్నారు. సీపీఎం నాయకుడు సి.శోభన్ సమాచార హక్కు చట్టం కింద వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఈ వివరాలను సేకరించారు.




Next Story