- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushap-2: అమ్మ ఊరికి వెళ్లింది.. కన్నీళ్లు తెప్పిస్తున్న తొక్కిసలాట మృతురాలి కూతురు మాటలు
అమ్మ ఊరికి వెళ్లింది అని సంధ్య థియేటర్(Sandha Thietre) తొక్కిసలాటలో మరణించిన రేవతి(Revathi) కూతురు చెబుతున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: అమ్మ ఊరికి వెళ్లింది అని సంధ్య థియేటర్(Sandha Thietre) తొక్కిసలాటలో మరణించిన రేవతి(Revathi) కూతురు చెబుతున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప-2(Pushpa-2) ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Roads) సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు రేవతి కుతూరు శాన్విక ఇచ్చిన సమాధానాలు కంట నీరు తెప్పిస్తున్నాయి. అమ్మ రోజు నాకు, అన్నయ్యకు అన్నం తినిపించేదని, బాగా చదువుకోవాలని, స్కూల్ కి, ట్యూషన్ కి తప్పకుండా వెళ్లాలని చెప్పేది అని అన్నది. అలాగే అమ్మ ఊరికి వెళ్లింది.. ఇక రాదు అని చెప్పింది. అంతేగాక అన్నయ్య హాస్పిటల్ లో ఉన్నాడని, నెల రోజుల తర్వాత వస్తాడని చెబుతూ.. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్ కి వెళతామని అంటున్న ఆ చిన్నారి ముద్దు ముద్దు మాటలు చూపరులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






