Puṣpa-2: పుష్ప-2 లాభాలతో వారికి పింఛన్లు ఇవ్వండి.. హైకోర్టులో పిల్ దాఖలు

by Prasad Jukanti |

పుష్ప-2 మూవీపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది.

Puṣpa-2: పుష్ప-2 లాభాలతో వారికి పింఛన్లు ఇవ్వండి.. హైకోర్టులో పిల్ దాఖలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప-2 (Pushpa-2) మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ తాజాగా తెలంగాణ హైకోర్టులో (TG High Court) ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది నరసింహారావు దాఖలు చేసిన ఈ పిల్ పై ఇవాళ విచారణ జరిగింది. హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ ఈ సినిమాకు బెనిఫిట్ షోలు (Benefit Show), టికెట్ ధరల పెంపుకు అవకాశం ఇచ్చింది. అనుమతి ఇవ్వడానికి కారణాలేంటో మాత్రం చెప్పలేదు. కానీ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో ఈ చిత్రానికి భారీగా లాభాలు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్ర లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని అందువల్ల పుష్ప-2 లాభాలు చిన్న చిత్రలా బడ్జెట్ రాయితీకి, జానపద కళాకారుల పించన్ కోసం కేటాయించాలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. విచారణ సందర్భంగా ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా అని పిటిషనర్ ను సీజే ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు వల్ల వచ్చిన లాభాల (Pushpa Movie Profits) గురించే పిటిషన్ దాఖలు చేశామని పిటషనర్ కోర్టుకు తెలిపారు. అయితే అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Next Story