ఇలా అయితే తల్లిదండ్రులు ఆడపిల్లలను క్రీడల్లోకి పంపరు: Pullela Gopichand

by Satheesh |   (  Updated:2023-08-13 10:43:40  IST  )

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ హరికృష్ణపై లైంగిక ఆరోపణలు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఇలా అయితే తల్లిదండ్రులు ఆడపిల్లలను క్రీడల్లోకి పంపరు: Pullela Gopichand
X

దిశ, వెబ్‌డెస్క్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ హరికృష్ణపై లైంగిక ఆరోపణలు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపి చంద్ రియాక్ట్ అయ్యారు. బాలికలపై వేధింపుల ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేశిక్షించకూడదని ఆయన కోరారు. క్రీడల్లోకి ఆడపిల్లలు తక్కువగా వస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఆడపిల్లలు వేధింపులకు గురైతే తల్లిదండ్రులు వాళ్లను క్రీడల వైపు పంపించారిన ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారిణులకు భద్రత కల్పించడం అత్యవసరం అని అన్నారు. కాగా, హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థినులపై ఓఎస్డీ హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే స్పందించిన ప్రభుత్వం హరికృష్ణను సస్పెండ్ చేసి.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

Next Story