- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు ఊరట కల్పించండి.. సొంత జిల్లాల నిబంధన ఎత్తివేయాలి: జగ్గారెడ్డి
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వారి సొంత జిల్లాలో పని చేయకూడదనే నిబంధనను ఎత్తి వేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వారి సొంత జిల్లాలో పని చేయకూడదనే నిబంధనను ఎత్తి వేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. సమయాభావం, అత్యవసర పరిస్థితి ఉన్నందున వెంటనే ఈ సమస్యను పరిశీలించి నిబంధనను ఎత్తి వేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా సొంత జిల్లాలలో పని చేయకూడదని ఐదు రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ బదిలీ నిబంధనలను విడుదల చేసినట్లు తెలిపారు. కింది స్థాయి ఉద్యోగుల విషయంలో ఇలాంటి నిబంధన విధించడం సరైంది కాదని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు 150 మంది సిబ్బంది వచ్చి సమస్యను విన్నవించారని తెలిపారు. ఈ నిబంధన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కానిస్టేబుళ్లు వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రెండు సంవత్సరాల్లో రిటైర్ అయ్యే హెడ్ కానిస్టేబుళ్లు సైతం ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. పిల్లల చదువులపై సైతం తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మానవతా దృక్పథంతో ఈ 8 ఎఫ్ నిబంధనను వెంటనే తొలగించాలని, ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా బదిలీలు చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు.






