Ponguleti Srinivas Reddy : మెట్రో సెకండ్ ఫేజ్ కు నిధులు ఇవ్వండి : మంత్రి పొంగులేటి

by Muthe.Rajitha |

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro Rail) విస్తరణపై తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas) కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు.

Ponguleti Srinivas Reddy : మెట్రో సెకండ్ ఫేజ్ కు నిధులు ఇవ్వండి : మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro Rail) విస్తరణపై తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Pongulety Srinivas) కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. నేడు వర్చువల్ గా పీఎం మోడీ(PM Narendra Modi) చేతుల మీదుగా పునఃప్రారంభం అయిన వరంగల్ రైల్వేస్టేషన్(Warangal Station) ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంతో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు.

సౌత్ సెంట్రల్, నార్త్ సెంట్రల్ రైల్వేలకు మధ్యలో ఉనా ఖాజీపేట రైల్వేస్టేషన్ ను డివిజన్ గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం తెలపాలని.. రెండో దశ మెట్రో విస్తరణకు అనుమతులతోపాటు, తక్షణమే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశలో 86.5 కిలోమీటర్లలో మూడు కారిడార్‌లు.. జేబీఎస్-మేడ్చల్ (23 కి.మీ.), జేబీఎస్-శామీర్‌పేట్ (22 కి.మీ.), శంషాబాద్ విమానాశ్రయం-ఫ్యూచర్ సిటీ (41.6 కి.మీ.)లను నిర్మించేందుకు రూ. 19,000 కోట్ల అంచనా వ్యయంతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(DPR) సిద్ధం చేసి, కేంద్రానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో రద్దీని తగ్గించి, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమంలో మోడీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. స్టేషన్ ఆధునీకరణతో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుందని పొంగులేటి పేర్కొన్నారు.

Next Story