Medicos Protest: వెనక్కి తగ్గేది లేదు.. రెండో రోజు కొనసాగుతున్న మెడికోల నిరసనలు

by Ramesh Naini |

మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ నందు ఎంబీబీఎస్ పూర్తి అయి ఇంటర్న్‌షిప్ చేస్తున్న మెడికోలు, (పీజీ) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.

Medicos Protest: వెనక్కి తగ్గేది లేదు.. రెండో రోజు కొనసాగుతున్న మెడికోల నిరసనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డైనమిక్ బ్యూరో: (Medicos Protest for Stipend)తమకు రావాల్సిన స్టైఫండ్ కోసం రెండో రోజు మెడికోలు దీక్షకు కొనసాగిస్తున్నారు. ఇవాళ (మంగళవారం) మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Mahaveer Institute Of Medical Sciences) వికారాబాద్ నందు ఎంబీబీఎస్ పూర్తి అయి ఇంటర్న్‌షిప్ చేస్తున్న మెడికోలు, (పీజీ) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు స్టైఫండ్ కోసం నిరసన చేస్తున్నారు. తమ స్టైఫండ్‌లను చెల్లించకుండా కాలేజీ యజమాన్యం బెదిరిస్తోందని మెడికోలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిష్కారం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మెడికోలు కోరుతున్నారు.

ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కళాశాలల విషయంలో కీలకమైన (NMC) నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) వర్చువల్ సమావేశం రేపు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్ల పట్ల ఎన్ఎంసీ కూడా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈ నెల 18న హెల్త్ సెక్రటరీ, డీఎంఈ హాజరుకావాలని NMC ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ విడుదల చేసింది.

Next Story