- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్లు సరిగా లేవు..నాకు ఫైన్ కట్టండి
కరీంనగర్ జిల్లా రేకుర్తి చౌరస్తాలో కోట శ్రీనివాస్ అనే వ్యక్తి వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. రోడ్డుపై వెళుతూ ఏది ధరించకపోయినా అన్నింటికీ ఫైన్ కడుతున్నానని, అసలు రోడ్లే సరిగ్గా లేవు నాకెంత ఫైన్ కడతారు అంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్ జిల్లా రేకుర్తి చౌరస్తాలో కోట శ్రీనివాస్ అనే వ్యక్తి వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. రోడ్డుపై వెళుతూ ఏది ధరించకపోయినా అన్నింటికీ ఫైన్ కడుతున్నానని, అసలు రోడ్లే సరిగ్గా లేవు నాకెంత ఫైన్ కడతారు అంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అద్వానంగా ఉందని కరీంనగర్-నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గానీ పొలిటిల్ లీడర్స్ గానీ ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.
రోడ్డు పైన తాను ఏది ధరించక పోయినా అన్నింటికీ ఫైన్, GSTలు, రోడ్డు టాక్స్ కడుతున్నానని చెప్పాడు. కానీ అసలు రోడ్లే సరిగా లేవు.. మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున అతడికి మద్దతు తెలుపుతున్నారు.






