Rajasingh: రాజాసింగ్ ఆఫీస్ వద్ద పాక్ జెండాలు తొక్కుతూ నిరసన.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-04-30 09:14:30  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rajasingh: రాజాసింగ్ ఆఫీస్ వద్ద పాక్ జెండాలు తొక్కుతూ నిరసన.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి తెలంగాణ పోలీసులపై ఫైర్ అయ్యారు. తెలంగాణ పోలీసులకు పాకిస్తాన్ పట్ల ఎందుకంత ప్రేమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పహెల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా తన కార్యాలయానికి వచ్చిపోయేవాళ్లు తొక్కుకుంటూ వెళ్లేలా పాకిస్తాన్ జెండాను నేలకు అతికిస్తే దాన్ని పోలీసులు తొలగిచండం ఏంటని మండిపడ్డారు. పహెల్గాం (Pahelgam Attack) ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి, ఒవైసీ క్యాండిల్ ర్యాలీ చేస్తూ మరో వైపు ఆ ఆదాడికి నిరసనగా పాకిస్తాన్ జెండాలు పెడితే వాటిని తొలగించాలని ఆదేశాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ రకమైన రాజకీయం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పోలీసులకు మంచిదికాదన్నారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

పోలీసులకు ఆ రెండు జెండాల తేడా తెలియదా?:

తాను తిరుపతిలో ఉన్నాని నిన్న తన కార్యాలయంలో మా బీజేపీ కార్యక్తలు నా ఆఫీస్ మెట్ల వద్ద పాకిస్తాన్ జెండాను (Pakistan Flag) ప్రింట్ తీసుకువచ్చి అతికించారు. వాళ్లు మంచి పని చేశారు. కానీ లోకల్ పోలీసులకు భయం ఎందుకో? ఏ దేశ ద్రోహి వారికి కంప్లయింట్ చేశారో తెలియదు. ఆ ఫ్లెక్సీని పోలీసులు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను పోలీసు ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే అది పాకిస్తాన్ జెండా కాదని ఇస్లామిక్ జెండా అని అందుకే దాన్ని తొలగించామని తొలుత చెప్పారని పోలీసులకు ఇస్లామిక్ జెండాకు, పాకిస్తాన్ జెడాకు తేడా తెలియదా అని నిలదీస్తే పాకిస్తాన్ జెండాను గుర్తించడంలో తమ పోలీసులు పొరపడ్డాని ఉన్నతాధికారి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జెండాకు, ఇస్లామిక్ జెండాల మధ్య చాలా తేడా ఉందని ఈ విషయం తెలియకుండానే నిన్న తన కార్యాలయానికి పోలీసులు వచ్చి చాలా తమాషా చేశారన్నారు. పోలీసులకు పాకిస్తాన్ పై ఎందుకింత ప్రేమ పుట్టుకువస్తోందని ప్రశ్నించారు. పహెల్గాంలో ఉగ్రవాదులు హిందువులను కాల్చి చంపడంపై దేశప్రజలంతా కోపంతో రగిలిపోతుంది. పాకిస్తాన్ ను, ఉగ్రవాదులకు బుద్ధిచెప్పేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటే తెలంగాణ పోలీసులు (Telangana Police) పాకిస్తాన్ జెండాలు ఎక్కడ పెడితే వాటిని తొలగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

Next Story