- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ ఇంటి ఎదుట ఆందోళన.. అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్ట్
తెలంగాణ విద్యా వ్యవస్థలో రేవంత్ సర్కార్ కీలక మార్పులు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యా వ్యవస్థలో రేవంత్ సర్కార్ కీలక మార్పులు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, లోయర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్ వంటి ప్రీ ప్రైమరీ కోర్సులను ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. అంగన్‌వాడీల్లో ప్రస్తుతం కొనసాగుతోన్న ప్రీ ప్రైమరీ వ్యవస్థ రద్దు చేయకూడదని, యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఇవాళ కొడంగల్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తాజా తీసుకున్న నిర్ణయంతో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతాయని వారు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకు దిగిన అంగన్‌వాడీ కార్యకర్తలను అదుపులోకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






