మమ్మల్ని రోడ్డు మీద పడేశారు.. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు నిరసన సెగ

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లైంది. దీంతో అన్ని పార్టీల‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వార్డుల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంత‌మంది నాయ‌కులకు నిర‌స‌న సెగ త‌గులుతోంది.

మమ్మల్ని రోడ్డు మీద పడేశారు.. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు నిరసన సెగ
X

దిశ‌, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లైంది. దీంతో అన్ని పార్టీల‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వార్డుల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంత‌మంది నాయ‌కులకు నిర‌స‌న సెగ త‌గులుతోంది. ప్ర‌జ‌ల‌తో పాటు టికెట్ ఆశించి బంగ‌ప‌డిన కార్య‌క‌ర్తలు కూడా నిర‌స‌న తెలుపుతున్నారు. తాజాగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె ర‌విశంక‌ర్‌కు సైతం అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. 4వ వార్డులో సుంకె రవిశంకర్ ప్రచారం చేస్తున్న సమయంలో ఆ వార్డు టికెట్ ఆశించిన కోమలత అనే మహిళ బూతులు తిట్టింది.

కోమలత టికెట్ ఆశించగా మరొకరికి ఇవ్వడంతో నిరాశ చెందినట్టు తెలుస్తోంది. ఇంట్లో ఉన్నవాళ్లను బయటకు రప్పించారని, ఇప్పుడు టికెట్ ఇవ్వకుంటే తన భర్త, పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. కోమలతతో పాటు ఆమె భర్త సైతం మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. మరోవైపు టికెట్ ఇవ్వకపోవడంతో కోమలత ఇప్పటికే రవిశంకర్ ఇంటిముందు పురుగల మందుతో నిరసన తెలిపింది. ఇప్పుడు తమ వార్డులో ప్రచారానికి రావడంతో అడ్డుకుని నిలదీసింది. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది.

Next Story